- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టీల్ ప్లాంట్ అభిృవృద్ధిపై బీజేపీ ఫోకస్.. కేంద్రమంత్రితో పురంధేశ్వరి కీలక చర్చలు
దిశ, వెబ్ డెస్క్: స్టిల్ ప్లాంట్ అభివృద్ధిపై రాష్ట్ర బీజేపీ ఫోకస్ పెట్టింది. గత ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కృషి చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ పురంధేశ్వరి హామీ ఇచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో స్టీల్ ప్లాంట్ సమస్యను పరిష్కరించేలా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కేంద్రమంత్రి కుమార స్వామితో పురంధేశ్వరి భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధిపై ఆయనతో చర్చించారు.
కాగా స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడంపై గత కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 2014లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడింది. ఆయన పాలనలో స్టీల్ ప్లాంట్‌లో అభివృద్ధి పనులు జరిగాయి. 2019లో జగన్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తు్న్నట్లు అప్పటి కేంద్రప్రభుత్వం ప్రకటన చేయడంతో రాష్ట్రంలో నిరసనలు హోరెత్తాయి. స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దంటూ డిమాండ్ చేశాయి. అయితే ఆ సమస్య అలానే ఉండిపోయింది. ఇటీవల రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు స్టీల్ ప్లాంట్ అభివృద్ధిపై హామీలు ఇచ్చాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమంటూ ప్రచారం చేశాయి. స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర బీజేపీ నేతలు సైతం హామీలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ మేరకు తొలి అడుగుగా కేంద్రమంత్రి కుమారస్వామితో రాష్ట్రం నుంచి చర్చలు మొదలయ్యాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.