- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీడీపీపై ప్రతీకారం తీర్చుకుంటాం: స్పీకర్ తమ్మినేని
దిశ, ఏపీ బ్యూరో: రానున్న ఎన్నికల్లో టీడీపీపై ప్రతీకారం తీర్చుకుంటామని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం రాజన్న దొర, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజులు అన్నారు. వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర సోమవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్ల కిరణ్ ఆధ్వర్యంలో చిలకపాలెం జంక్షన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. రూ.300 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ఎచ్చెర్ల నియోజకవర్గానికి సీఎం జగన్ మంజూరు చేశారని, దీంతో ఇకపై ఉపాధి కోసం గుజరాత్ వంటి రాష్ట్రాలకు మత్స్యకారులు వలస వెళ్లే పరిస్థితి ఉండదన్నారు. రాజ్యాంగ బద్దమైన పాలనను జగన్ చేస్తున్నారని, ప్రభుత్వంలోనూ, పాలనలోనూ వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. జగన్ పేదలకు సాయం చేస్తుంటే చంద్రబాబు అన్యాయమని చెబుతూ తనకు మరోసారి అధికారం కావాలని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. విశాఖను పరిపాలన రాజధానిని కాకుండా అడ్డుకుంటూ అన్యాయం చేస్తున్న చంద్రబాబును ఈ ఎన్నికల్లో మట్టి కరిపించాలని కోరారు. ప్రజలే జగన్ బలమని, ఆయనే అందరికీ ఆత్మబలమన్నారు. జగన్ కులం, మతం, రాజకీయం, వర్గాలు లేకుండా అందరికీ మేలు చేయడానికే నాలుగున్నరేళ్లుగా పరితపిస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో ఏ వర్గానికి గుర్తింపు లేకుండా పోయిందని, గిరిజనులకు మంత్రి పదవి కూడా ఇవ్వకపోతే జగన్ ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించారని తెలిపారు.
జగన్‌ను మళ్లీ సీఎం చేసుకుందాం: ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్ల కిరణ్
రాష్ట్ర చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో అన్ని వర్గాల ప్రజలకు చేయూతనిస్తూ సంక్షేమ పాలనను జగన్ చేస్తున్నారని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్ల కిరణ్ అన్నారు. ప్రతి పక్షాలు అనేక కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ జగన్ సీఎంగా ఓడించాలని చూస్తున్నారని, ప్రజలంతా ఆలోచన చేసి ఈ దుర్మార్గుల దురాలోచనతో వస్తున్న వారిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో జగన్‌ను మళ్లీ సీఎంగా గెలిపించుకునేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.