Srikakulam: రూ.30 వేలు అడిగాడు.. అడ్డంగా బుక్కయాడు

by srinivas |
Srikakulam: రూ.30 వేలు అడిగాడు.. అడ్డంగా బుక్కయాడు
X

దిశ, వెబ్ డెస్క్: వేలకు వేలు జీతం తీసుకుంటూ అవి సరిపోవడం లేదన్నట్లు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు లంచావతారాలు ఎత్తుతున్నారు. సక్రమంగా చేయాల్సిన పనులకు లంచం డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇస్తేగానే పని చేయం అన్న విధంగా తయారవుతున్నారు. ఇలా ఓ అధికారి కూడా లంచాలకు అలవాటు అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. వెంకటరమణ అనే వ్యక్తి ఏపీఈపీడీసీఎల్ ఏఈగా పని చేస్తున్నారు. ఇతను ఏ పని చేయలన్నా డబ్బులు ఇవ్వాల్సిందే. లేదంటే ఆ పని జరగదంతే. అలాంటి అవినీతి అధికారికి అప్పారావు అనే రైతు చెక్ పెట్టాడు. తన పొలానికి విద్యుత్ కనెక్షన్ కోసం ఏఈ వెంకటరమణను కలిశారు.

అయితే కనెక్షన్ ఇచ్చేందుకు సదరు అధికారి రూ. 30 వేలు లంచం అడిగారు. అంత డబ్బులు ఇచ్చుకోలేని అన్నదాత.. ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏఈ వెంకట రమణ అవినీతి బాగోతాన్ని ఏసీబీ అధికారులు బయటపెట్టారు. లంచం తీసుకుంటున్న వెంకరమణను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ అధికారులుగా ఉండి లంచం డిమాండ్ చేయడం నేరమని, కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed