కోటంరెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డి నాపై దాడి చేయించాడు: విష్ణువర్ధన్ రెడ్డి

by srinivas |   ( Updated:2023-03-23 17:14:10.0  )
కోటంరెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డి నాపై దాడి చేయించాడు: విష్ణువర్ధన్ రెడ్డి
X

దిశ, నెల్లూరు: గతంలో నెల్లూరు రోడ్‌లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డి తనపై దాడి చేయించారని నెల్లూరు రూరల్ బూత్ కమిటీల ఇంచార్జ్ బోడుమల్ల విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. తనపై చేయించిన దాడిలో 32 కుట్లతో బతికి బయటపడ్డానని ఆయన పేర్కొన్నారు. తనపై జరిగిన హత్యాయత్నంలో ప్రధాన సూత్రధారి గిరిధర్ రెడ్డి A1 ముద్దాయిగా చేర్చాలని డిమాండ్ చేశారు. నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్ ఠాగూర్ కళ్యాణ మండపంలో విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గిరిధర్ రెడ్డి ఒక డమ్మీ రాజకీయ నాయకుడన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న గ్రామాల పేర్లు, నాయకులపేర్లు కనీసం తెలియని నాయకుడని విమర్శించారు. తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ఈ డమ్మీ నాయకుడు కాలకోట విష నాగుపాము వలే చంద్రబాబును, కార్యకర్తలను కాటేస్తాడని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed