జగన్ ఎప్పటికీ సీఎం కాలేరు: వైసీపీ రెబల్ ఎమ్మెల్యే

by srinivas |   ( Updated:2023-12-25 12:45:03.0  )
జగన్ ఎప్పటికీ సీఎం కాలేరు: వైసీపీ రెబల్ ఎమ్మెల్యే
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్‌పై వైసీపీ బహిష్కృత నేత, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఇక జమ్మలో ముఖ్యమంత్రి కాలేరని ఆయన జోస్యం చెప్పారు. జగన్‌ను గెలిపించి తాము చాలా తప్పు చేశామని చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జగన్‌పై విరుచుకుపడ్డారు.


నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానన్న గౌరవం కూడా లేకుండా సీఎం జగన్ తనను కించపర్చారని చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. పార్టీ కోసం నెల్లూరు జిల్లాలో తాను చాలా కృషి చేశానని చెప్పారు. లేనిపోని అనుమానాలతో తన టికెట్‌ను జగన్ అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. అవగాహన రాహిత్యంతో రాష్ట్రాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు. జగన్‌కు సీఎం పదవిని దేవుడు వరమిచ్చినట్లు గ్రహించాలన్నారు. జగన్ ప్రభుత్వంలో ఏ ఒక్క గ్రామం కూడా అభివృద్ధి చెందలేదని విమర్శించారు. అటు ప్రజలు కూడా బాగుపడిందేమి లేదన్నారు. విశాఖ రుషి‌కొండలో సరదాగా భవనాలు కట్టుకున్నట్లుందని చంద్రశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed