Nelloreలో చీకటి రాజకీయాలు.. టీడీపీకి భారీగా మైనస్

by srinivas |   ( Updated:2023-02-26 10:16:08.0  )
Nelloreలో చీకటి రాజకీయాలు.. టీడీపీకి భారీగా మైనస్
X

దిశ, నెల్లూరు: 2022లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తూ 54/54 డివిజన్లలో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. టీడీపీ కనీసం ఖాతా తెరవక పోగా కొన్ని స్థానాల్లో భారీ ఓటమిని చెవి చూడాల్సి వచ్చింది. ఇదే 2014 కార్పొరేషన్ ఎన్నికల్లో అయితే టీడీపీ 19 డివిజన్లను కైవసం చేసుకుని మరికొందరు వైసీపీ కార్పొరేటర్లను తమ వైపునకు తిప్పుకుని మేయర్ పీఠాన్ని దక్కించుకోగలిగింది. గత కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి కంచుకోటగా ఉన్న డివిజన్లను టీడీపీ కోల్పోయింది. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి తమ పార్టీ నేతలే కారణమన్న విమర్శలులేక పోలేదు. నెల్లూరు రూరల్ ఇంచార్జి మాజీ మేయర్ అబ్ధుల్ అజీజ్, సిటీ ఇంచార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కార్పొరేషన్ ఎన్నికల్లో ఘోర ఓటమికి కారకులైయ్యారని ఆ సమయంలో విమర్శలు జోరుగా సాగాయి.


వైసీపీ కోవర్టులుగా టీడీపీ నేతలు

నెల్లూరులోని కొన్ని డివిజన్లలో టీడీపీకి మంచి పట్టే ఉంది. కొందరు టీడీపీలోని వైసీపీ కోవర్టుల కారణంగా ఆ సెగ్మెంట్లలో టీడీపీ ఓటమికి కారణమైందని విమర్శలు ఉన్నాయి. టీడీపీ ఇంచార్జిలు వైసీపీకి కోవర్టుగా వ్యవహరిస్తూ ఎన్నికల సమయంలో భారీ మొత్తంలో డబ్బు ముట్టడంతో కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి చెందిందని కొంతకాలం టాక్ నడిచింది. ఇలా టీడీపీలో కొనసాగుతూ పార్టీ గెలుపు కోసం ప్రచారం చేస్తూ ఎన్నికలు సమీపించే సమయంలో ఇతర పార్టీలకు అమ్ముడు పోవడం పార్టీని తీవ్రంగా దెబ్బతీసిందని పార్టీ నేతల్లో ఏర్పడింది. ఇలా డబ్బు ఆశతో టీడీపీలో కొనసాగుతున్నా సపోర్ట్ మాత్రం వైసీపీకే ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇంత జరుగుతున్నా ఆ ఇద్దరి నేతలును ఇంఛార్జులుగా కొనసాగించడం టీడీపీకి మైనస్సేనని విక్షేషకులు అభిప్రాయపడుతున్నారు.

వైసీపీ నేతలతో మంతనాలు

కొందరు టీడీపీ నేతలు వైసీపీతో మంతనాలు జరుపుతూ మూడో కంటికి తెలియకుండా చీకట్లో రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. నెల్లూరు టీడీపీని అధిష్టానం పూర్తిగా కొందరి నాయకులకు మాత్రమే అప్పచెప్పడం ఆ పార్టీకి పూర్తి మైనస్‌గా మారింది. టీడీపీలోని ముఖ్యనేతలు కొందరూ వైసీపీ నేతలకు టచ్‌లోనే ఉంటూ పార్టీ అంతర్గత విషయాలను సైతం పంచుకుంటున్నారని తెలిసింది. వైసీపీ నేతలు కూడా టీడీపీ అంతర్గత విషయాలను సొమ్ము చేసుకుని టీడీపీని నెల్లూరులో ఎదగనీయకుండా కార్పొరేషన్ ఎన్నికల్లో అడ్డుకట్ట వేయగలిగారని పుకార్లు ఉన్నాయి

అధిష్టానం అందించిన డబ్బులు పూర్తిస్థాయిలో ఖర్చు చేయని నేతలు

2019 అంసెబ్లీ ఎన్నికల్లో టీడీపీ ముఖ్యనేతలే మాజీ మంత్రి నారాయణ ఓటమికి కారకులైయ్యారన్న విమర్శలు ఉన్నాయి. గత కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం 5 కోట్ల రూపాయలు ఎన్నికలు ఖర్చుకు అందించారు. అయితే ఆ డబ్బును పూర్తిస్థాయిలో వినియోగించకుండా కార్పొరేషన్ అభ్యర్థులకు కొద్ది మొత్తంలో ఇవ్వడం వారు కూడా ఎన్నికలను తెలికగా తీసుకోవడంతోనే కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమికి కారణమైందన్న ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ అధిష్టానం అందించిన డబ్బును పూర్తి స్థాయిలో కార్పొరేషన్ అభ్యర్థులకు ఇచ్చి ఎన్నికల్లో ఖర్చు చేసి ఉంటే కనీసం కొన్ని కార్పొరేషన్లనైనా టీడీపీ గెలిచుండేదని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి నారాయణ పోటీ చేస్తే టీడీపీ గెలుపొందే అవకాశం ఉందని, సర్యేలు కూడా ఆయనకే అనుకూలంగా ఉన్నాయని పార్టీ క్యాడర్ భావిస్తుంది. అయితే నారాయణ పోటీ చేస్తారా లేదా అన్న సందిగ్థత నెలకొంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed