- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nara Lokesh బలమైన ఆలోచనతో ఉన్నాం.. బాగు చేస్తాం..!
దిశ, డైనమిక్ బ్యూరో: లూథరన్ చర్చికి చెందిన వేలకోట్ల ఆస్తులను వైసీపీ నాయకులు కబ్జా చేసి, అన్యాక్రాంతం చేసి అమ్మేశారని, క్రిస్టియన్ మైనారిటీల ఆస్తుల పరిరక్షణ, సంక్షేమంపై దృష్టి పెట్టాలని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు బుధవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కోరారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కిలిలో క్రైస్తవ మత పెద్దలతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. తమ ప్రాంతంలో క్రైస్తవులకు శ్మశానం, కమ్యూనిటీహాలు లేదని, స్థానిక నాయకులు పక్షపాతంగా వ్యవహరించి పాస్టర్లను అవమానిస్తున్నారని, సమస్యలు సృష్టించి వేధిస్తున్నారని వాపోయారు. వెంకటగిరిలో తాము గతంలో మగ్గాల పని చేసుకునే వాళ్లమని, గిట్టుబాటు కాకపోవడంతో మగ్గాల పనికూడా నిలిపేసి, కూలి పనులకు వెళ్లాల్సి వస్తోంది, పెన్షన్ పునరుద్ధరించి ఆదుకోవాలని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ..మైనారిటీ కార్పొరేషన్‌ను విభజించాలని తాము ప్రధానంగా ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా ముస్లింలు, క్రైస్తవులకు వేర్వేరు కార్పొరేషన్ ఉంటుందన్నార. ఈ కార్పొరేషన్ ద్వారా శ్మశానాలు, చర్చిలకు స్థలాలు ఇవ్వడానికి అవకాశం ఉందని తెలిపారు. కార్పొరేషన్ ద్వారా పాస్టర్లకు గౌరవవేతనం ఇవ్వడానికి అవకాశం లభిస్తుందని లోకేశ్ హామీ ఇచ్చారు. పాస్టర్లకు అండగా ఉండేందుకు పార్టీ అనుబంధ విభాగాలను బలోపేతం చేస్తామని, ఈ బాధ్యతను చంద్రబాబు తనకు అప్పగించారని చెప్పారు. పాస్టర్లకు అన్ని వేళలా తాను అందుబాటులో ఉంటానని, ఏ సమస్య ఉన్నా తనతో చెప్పుకోవచ్చని లోకేశ్ తెలియజేశారు. సంఘాల ఆస్తులను పరిరక్షించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, పాస్టర్లకు పెన్షన్లు ఇవ్వడం, తీసేయడంలో రాజకీయ జోక్యం అధికమైందని, ఓ పాస్టర్ రూ.30 వేలు పెట్టి కారు కొంటే, దాన్ని ఆధారంగా చేసుకుని పెన్షన్ రద్దు చేశారని లోకేశ్ తెలియజేశారు.
వెంకటగిరి ప్రాంతంలో పరిశ్రమలు తీసుకురావాలనే బలమైన ఆలోచనతో ఉన్నాం. చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను తెచ్చి క్రిస్టియన్ మైనారిటీలకు కూడా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు కల్పించడంలో చంద్రబాబు బ్రాండ్‌ను ఏపీలో నిరూపిస్తామని చెప్పారు. ఏపీపీఎస్సీని యూపీఎస్సీలా బలోపేతం చేసి, క్రమశిక్షణ మార్గంలో నడిపిస్తామని, క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. స్వయం ఉపాధి అవకాశాలు కూడా పెద్దఎత్తున ప్రోత్సహించి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో సీఎం అయ్యాక 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. క్రిస్టియన్ మైనారిటీలతో మూడు నెలలకు ఒకసారి మీటింగ్ నిర్వహించి, సంబంధిత మంత్రి, అధికారులతో చర్చించి పాస్టర్ల సమస్యలను పరిష్కరిస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి : Breking: వైసీపీ అనేది ఉప్మా ప్రభుత్వం.. సంక్షేమ పథకాలపై పవన్ సంచలన వ్యాఖ్యలు