Nellore: రైలు ఢీకొని వ్యక్తి మృతి

by srinivas |   ( Updated:2023-01-28 15:12:42.0  )
Nellore: రైలు ఢీకొని వ్యక్తి మృతి
X

దిశ, నెల్లూరు: ఆత్మకూరు బస్టాండు రైల్వే అండర్ బ్రిడ్జి ట్రాక్‌పై రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. కొన్ని రోజుల క్రితం అదే స్థలంలో జరిగిన రైలు ప్రమాదంలో రైలు ఢీకొని ముగ్గురు మరణించారు. ఈ సంఘటన నుంచి తీరుకోకముందే అదే తరహాలో మరో వ్యక్తి మరణించాడు. ఈ స్థలంలో ఒకే తరహా ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని, ఇప్పటికైనా అధికారులు ఈ ప్రదేశంలోని నడక మార్గానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపి మారో ప్రాణం పోకుండా కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ప్రాణాలు పోవడానికి రైలు ట్రాక్‌పై అవగాహన లేకుండా నడవడం ప్రధాన కారణమని తెలుస్తోంది. చనిపోయిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story