- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Nellore: జగన్ మామయ్యా మా స్కూలు మాకు కావాలి: విద్యార్థులు
దిశ, నెల్లూరు: ‘జగన్ మామయ్యా మా స్కూల్ మాకు కావాలి, మీ జీవోలు మాకు వద్దు’ అంటూ నెల్లూరు సెయింట్ జోసెఫ్ స్కూలు విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేశారు. సెయింట్ జోసెఫ్ స్కూలును వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి మూసివేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెయింట్ జోసెఫ్ స్కూలు మూసి వేయొద్దంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక విద్యార్థుల ఆందోళనకు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గునుకుల కిషోర్ మద్దతు తెలుపుతూ నిరసనలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కిషోర్ మాట్లాడుతూ సెయింట్ జోసఫ్స్ ఎయిడెడ్ స్కూల్ వచ్చే విద్యాసంవత్సరం మూసివేస్తున్న ప్రభుత్వం జీవో జారీ చేయడంపై ఆయన మండిపడ్డారు. వచ్చే ఏడాది మూసివేస్తారనీ, విద్యార్ధులు వేరే స్కూల్ చూసు కోవాల్సిందిగా నిర్వాహకులు తెలపడం బాధాకరమన్నారు. ప్రభుత్వం చర్యతో 150 మంది విద్యార్థులు చదువుకు దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్ధులకు ఉచిత విద్యను అందించిన స్కూల్‌ను మూసి వేయడం సరికాదన్నారు. స్కూల్ మూసివేతపై స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ వేడుక చూస్తున్నట్లు చూస్తున్నారని కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి: Badvel: చంద్రబాబు పర్యటనలో హైటెన్షన్.. పోలీసుల జోక్యంతో ప్రశాంతం