Mla Sridhar Redddy: ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటా

by srinivas |
Mla Sridhar Redddy: ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటా
X

దిశ, నెల్లూరు: అధికారం ఉన్నా, లేకున్నా ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాలను తెలుసుకున్నానని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 29వ డివిజన్‌లో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కోటంరెడ్డి మాట్లాడుతూ తాను అత్యంత కష్టకాలంలో ఉన్నానని తెలిపారు. ప్రజల ఆశీస్సుల కోసం వచ్చానని, ఎల్లప్పుడూ తమ ఆశీస్సులు ఇలాగే ఉండాలని కోరారు. గత 9 ఏళ్లుగా అధికారం ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ఎమ్మెల్యే అంటే శ్రీధర్ రెడ్డిలాగా ఉండాలనే విధంగా చేసి చూపించానని వెల్లడించారు. అధికార పార్టీ శానసభ్యుడిగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం చెప్పులు అరిగేలా తిరిగానని స్పష్టం చేశారు. అధికార పక్షం నుంచి దూరంగా జరిగిన తరువాత కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటానని శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed