- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం జగన్‌కు థ్యాంక్స్: Mla Kotam Reddy
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి థ్యాక్స్ చెప్పారు. ఎట్టకేలకు బారాషాహీద్ అభివృద్ధికి ప్రభుత్వం గతంలో కేటాయించిన రూ.15 కోట్లు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని అభినందించారు. బారాషాహీద్ అభివృద్ధికి రూ. 7.5 కోట్లు, మసీద్ నిర్మాణానికి రూ. 7.5 కోట్లు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.జిల్లా ముస్లిం సోదరుల పక్షాన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి, ప్రభుత్వానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ‘ఇది నా విజయం కాదు... ముస్లిం సమాజం మొత్తం పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి సాధించారు’ అని వ్యాఖ్యానించారు. ఇకపోతే బారాషాహీద్ దర్గా అభివృద్ధికి రూ.15 కోట్లు కేటాయించి మూడేళ్లు అయ్యింది. నిధులు విడుదల చేయాలని సీఎం వైఎస్ జగన్‌ను అభ్యర్థిస్తే 9 నెలల ముందు జీవో జారీ చేశారని, అయితే అందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వలేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. కాంట్రాక్టర్‌తో మాట్లాడి పనులు ప్రారంభించామని..మసీద్ నిర్మాణానికి నాలుగు సార్లు టెండర్లు పిలిస్తే ఒక్క కాంట్రాక్టర్ కూడా టెండర్ వేయలేదని ఆయన గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ ఇచ్చిన హామీ నెరవేర్చాలని నిరసనకు దిగారు. వారం రోజుల నుంచి మసీదులు, ఈద్గాల నుంచి లక్షాలది మంది ముస్లిం పెద్దల ద్వారా వాట్సప్, టెక్ట్స్ మేసేజెస్ ద్వారా వినతులు ఇచ్చే ప్రయత్నం చేయడంతో ప్రభుత్వం దిగి వచ్చింది.
మరో పోరాటానికి సన్నద్ధం
నెల్లూరు రూరల్ నియోజకవర్గం గురుకుల పాఠశాల, ములుముడి రోడ్డు, పొట్టేపాలెం కలుజు బ్రిడ్జి, షాదీ మంజిల్, స్టడి సర్కిల్స్, కాపు భవన్, ఆమంచర్ల పారిశ్రామికవాడ, జగనన్న కాలనీల్లో వసతులు వంటి సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కొమ్మరపూడి సాగునీటి పనులు, ఇళ్ల స్థలాల నగదు, గణేష్ ఘాట్, గోమతినగర్ బ్రిడ్జి వంటి సమస్యలపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో తప్ప మిగిలిన సమయంలో రాజకీయం వద్దని, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. తాను కొత్తగా ప్రజా సమస్యలపై మాట్లాడడం లేదని, నాలుగేళ్లుగా మాట్లాడుతున్నానని, ముఖ్యమంత్రి రెండేళ్ల క్రితమే ఈ వినతిపత్రాలపై సంతకాలు పెట్టారు కానీ పరిష్కారానికి నోచుకోలేదన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం సమస్యలపై మరో పోరాటం చేస్తానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.
Also Read..
రాష్ట్రాన్ని దోచుకుంది అయ్యన్న, చంద్రబాబులే: ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్