Ap Assembly: ఎమ్మెల్యే కోటంరెడ్డి సస్పెన్షన్.. అన్యాయమంటూ ఆవేదన

by srinivas |   ( Updated:2023-03-15 11:42:18.0  )
Ap Assembly: ఎమ్మెల్యే కోటంరెడ్డి సస్పెన్షన్.. అన్యాయమంటూ ఆవేదన
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెన్షన్ వేటు వేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై సభలో ప్రస్తావించేందుకు అవకాశం ఇవ్వాలని రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. సభలో ప్లకార్డులను చూపిస్తూ నిరసన తెలిపారు.

బడ్జెట్ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెండ్

అయితే శాసన సభా వ్యవహారాలకు నిత్యం అడ్డుపడుతున్నారని కోటంరెడ్డిని ఈ బడ్జెట్ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీంతో స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని బడ్జెట్‌ సమావేశాలు పూర్తయ్యేవరకు సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

ఏం తప్పు చేశానని సస్పెండ్ చేశారో చెప్పాలి

తనను సస్పెండ్ చేయడంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం తప్పు చేశానని సస్పెండ్ చేశారో చెప్పాలని నిలదీశారు. తన నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించాలని పట్టుబడితే సస్పెండ్ చేస్తారా? అని నిలదీశారు. అన్యాయంగా, దౌర్జన్యంగా తనను సస్పెండ్‌ చేశారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story