- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం.. మంత్రి కారుమూరి
దిశ, నెల్లూరు: రైతు పండించే పంటలో ప్రతిగింజను కొనుగోలు చేస్తామని మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు పేర్కొన్నారు. గోధుమ పిండి పంపిణీ పైలట్ ప్రాజెక్టు గా ఉత్తరాంధ్రలో ప్రారంభించామని తెలిపారు. త్వరలో రాష్ట్రమంతటా ప్రారంభిస్తామన్నారు. విజయవాడ రూరల్ కానూరు లోని పౌర సరఫరాల భవనంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ రూమ్ ను బుధవారం మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారత దేశంలోనే తొలి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించామన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి పూర్తి సమాచారం ఈ సెంటర్ ద్వారా తెలుస్తుందన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి 13 ఉమ్మడి జిల్లాల్లో కార్యకలాపాలు మోనటరింగ్ చేస్తామని మంత్రి తెలిపారు. రైతు పండించిన పంటకు సంబంధించి ధాన్యం సేకరణ, ప్రజాపంపిణీ వ్యవస్థ మొబైల్ వాహనాల ద్వారా లబ్ధిదారుల ఇంటికి అందించే కార్యక్రమం జరుగుతుందన్నారు.
ఎంఎల్ఎస్ గోడౌన్ లను, రైస్ మిల్లులు, స్టేజ్ - 1, 2 రవాణా వాహనాల కదలికలను సంబంధిత వివరాలను అనుసందానం చేసి ఒకే చోటు నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి మోనటరింగ్ చేయడం జరుగుతుందని అన్నారు. ఇంకనూ మొబైల్ వాహనాల కదలిక, ఇంటివద్దనే బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ, అంగన్ వాడి కేంద్రాలకు, పాఠశాలలకు పంపిణీ చేయు నిత్యావసర సరుకులను పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.
Read more: