- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Minister Kakani: వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు
దిశ, నెల్లూరు: దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైద్య రంగానికి పెద్ద పీట వేసి, ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందించారని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి గుర్తు చేశారు. సీఎం జగన్ అత్యాధునిక టెక్నాలజీతో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని కొనియాడారు. సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో 46 లక్షలతో ఏర్పాటు చేసిన ఎక్స్ రే యూనిట్‌ను, రక్త నిల్వ కేంద్రాన్ని మంత్రి గురువారం ప్రారంభించారు.
ఈ సందర్బంగా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ పొదలకూరులో సామాజిక ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది ప్రజలకు సమర్ధవంతమైన సేవలు అందించడంతో అనేక అవార్డులు వచ్చాయని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో వైద్యులు లేక ప్రజలు నానా అవస్థలు పడ్డారని జగన్ వైద్య రంగంలో తీసుకొచ్చిన సరికొత్త సంస్కరణలతో దేశంలోనే అగ్రగామిగా ఏపీ ఉందని చెప్పారు. పేదలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కాకాణి పేర్కొన్నారు.