షర్మిల.. ఆ ఘటన మర్చిపోయావా?: నారాయణస్వామి

by srinivas |
Narayana Swamy
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందని మండిపడుతున్నారు. వైఎస్ జగన్‌ను జైలుకు పంపిన విషయాన్ని గుర్తు చేస్తూ విరుచుకుపడుతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ కుటుంబాన్ని చీల్చిన కాంగ్రెస్ పార్టీ చివరకు అన్నాచెల్లెల్ని కూడా విడగొట్టిందని ఆరోపించారు. జగన్‌పై యుద్ధం చేస్తానంటున్న వైఎస్ షర్మిలకు ఎలాంటి తప్పు చేయని ఆయన్ను జైలుకు పంపిన ఘటన గుర్తు లేదా అని ప్రశ్నించారు. షర్మిల సోనియా వదిలిన బాణమా అంటూ నిలదీశారు. దళిత ప్రజాప్రతినిధులెవరూ కూడా షర్మిల వెంట వెళ్లరని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా జగన్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed