- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇద్దరు ఎమ్మెల్యేలకు CM Jagan క్లాస్!
దిశ, డైనమిక్ బ్యూరో: 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి జగన్ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 32 ఎమ్మెల్యేల పని తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ 32 మంది ఎమ్మెల్యేలలో ఏడుగురు మంత్రులు కూడా ఉన్నారు.
ఇక నెల్లూరు జిల్లా నుంచి మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్, సూళ్లూరు పేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యలు సైతం వెనుకబడి ఉన్నారని సీఎం జగన్ అన్నట్లు సమాచారం. పనితీరు మెరుగుపరచుకోవాలని సీఎం జగన్ సూచించినట్లు తెలుస్తోంది. 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో మరింత దూకుడు పెంచాలని, ప్రజల్లో మరింతగా చొచ్చుకుపోవాలని సీఎం జగన్ సూచించినట్లు తెలుస్తోంది.
మరో 16 నెలలు మాత్రమే సమయం ఉండటంతో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని సీఎం జగన్ సూచించారు. 100 రోజుల్లో పనితీరు బాగోలేని ఎమ్మెల్యేలు తమ పనితీరును మెరుగుపరచుకోవాలని లేని పక్షంలో వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తామని సీఎం జగన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.