- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏలూరు జాతీయ రహదారిపై ఆకస్మిక తనిఖీలు
దిశ,ఏలూరు: ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప శివ కిషోర్ సోమవారం అర్ధరాత్రి ఏలూరు నగరం, జాతీయ రహదారి పై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఏలూరు జిల్లాలో నేర నియంత్రణకు స్వయంగా ఈ తనిఖీలు జరిపారు. ముందుగా ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్‌లో ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ స్టేషన్, గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్‌లలో తనిఖీలు నిర్వహించారు. ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ వద్ద వచ్చే ప్రయాణికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రైల్వే స్టేషన్‌లో పని చేస్తున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీస్ సిబ్బందితో మాట్లాడుతూ రైళ్ల రాకపోకలు సమయంలో తనిఖీ చేసే విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఏలూరు పాత బస్టాండ్‌లో రాత్రిపూట ఉన్న వారి వివరాలు అడిగి వారు ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలప టోల్ ప్లాజా వద్ద జిల్లా ఎస్పీ అధికారులతో కలిసి లారీలను బస్సులను తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీతో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, ఏలూరు రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్, పెదపాడు ఎస్సై కట్టా శారద సతీష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.