- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాసేపట్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. సీట్ల సర్దుబాటుపై చర్చ
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక మలుపులు తీసుకుంటున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి సీఎం జగన్ దూకుడు పెంచగా.. తాజాగా.. విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన అప్రమత్తమయ్యాయి. కాసేపట్లో అమరావతి వేదికగా ఇరు పార్టీల అధినేతలైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు. ఉమ్మడి బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇరు పార్టీల అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాలని ప్లాన్ చేస్తున్నారు.
మరోవైపు ఎవరికెన్ని సీట్లు.. ఎవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తారు.. అనే క్లారిటీ రాకముందే.. అభ్యర్థులు ఎవరికి వారు తమ సీటు ఇదే ప్రకటించుకుంటున్నారు. ముందుగానే తమ బలమేంటో అధిష్టానానికి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో సీట్ల పంపకాల ప్రక్రియను మరింత క్లిష్టంగా మార్చేస్తున్నారు. అంతర్గతంగా కూడా ఇరు పార్టీల్లో లొల్లి ముదరింది. దీంతో అందరి భవిష్యత్తు అధినేతలు తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉన్నాయి.