- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. వారి పదవులు మూన్నాళ్ల ముచ్చటే..
దిశ, ఏపీ బ్యూరో: అదేంటో గానీ జగన్ ప్రభుత్వానికి వరుస ఎదురు దెబ్బలు తప్పడం లేదు. మడమ తిప్పేది లేదని తీసుకున్న అనేక నిర్ణయాలపై దిద్దుబాట్లు, కొట్టివేతలు చేయక తప్పని స్థితి. గతంలో శాసన మండలి, ఇటీవల మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు తీర్మానం వంటి నిర్ణయాలను ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. తాజాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన స్మార్ట్ సిటీ చైర్మన్‌లతో రాజీనామా చేయించి, వెనువెంటనే ఆమోదించింది. ప్రభుత్వం చైర్మన్ల పదవులు చేపట్టిన వారి పరిస్థితి మూణ్నాళ్ల ముచ్చట అన్న చందంగా మారింది.
నిబంధనలకు విరుద్ధంగా పదవుల భర్తీ
దేశంలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న పట్టణాలు, నగరాలను కేంద్రం గుర్తించింది. త్వరితగతిన అవి డెవలప్మెంట్ కు అవకాశం ఉండడంతో వాటిని స్మార్ట్ సిటీలుగా నామకరణం చేసింది. అలాంటి వాటికి అదనపు నిధులు అందించడంతో పాటు వివిధ కేంద్ర పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులు కల్పించడం వంటి అంశాల్లో పెద్దపీట వేసింది. మన రాష్ట్రంలో విశాఖ, తిరుపతి, కాకినాడ, ఏలూరు నగరాలను స్మార్ట్ సిటీలుగా ఎంపిక అయ్యాయి. వీటికి చైర్మన్‌లుగా కార్యనిర్వహణాధికారులుగా కొందరిని నియమించే అవకాశం కూడా కొన్ని నిబంధనలతో రాష్ట్రాలకు కల్పించింది. నిబంధనల ప్రకారం స్మార్ట్ సిటీలకు చైర్మన్‌లుగా నామినేటెడ్ వ్యక్తులు ఉండడానికి అనర్హులు. అయినా పార్టీ వ్యక్తులను ఎలాంటి జీతభత్యాలూ లేకుండా ప్రభుత్వం స్మార్ట్ సిటీ చైర్ పర్సన్స్ గా నియమించింది. ఇది కేంద్రం దృష్టికి వెళ్లడంతో నిబంధనల ప్రకారం స్మార్ట్ సిటీలకు చైర్మన్ లుగా ఉండాలంటే కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ స్థాయి వ్యక్తులు మాత్రమే అర్హులు. దీంతో పార్టీ వ్యక్తులతో ఈ పోస్టులను భర్తీ చేయడాన్ని కేంద్రం తప్పుపట్టింది. న్యాయపరమైన చిక్కులు సైతం తప్పవని భావించిన ప్రభుత్వం స్మార్ట్ సిటీ చైర్మన్లను రాజీనామా చేయాలని ఆదేశించింది. రాజీనామాలను ఆమోదించడమూ జరిగిపోయింది. విశాఖ చైర్మన్ జీ వెంకటేశ్వరరావు, కాకినాడ చైర్మన్ రాజుబాబు, ఏలూరు చైర్మన్ అఖిల, తిరుపతి చైర్మన్ పద్మజ రాజీనామాలు సమర్పించారు .
రాజకీయ పునరావాసం కోసమే.. : బీజేపీ నేత ఎమ్మెల్సీ మాధవ్
అభివృద్ధిని వేగవంతం చేయడానికి కేంద్రం ప్రకటించిన స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లను ప్రభుత్వం రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేసింది. కార్పొరేషన్ల అభివృద్ధి పేరుతో భారీ మొత్తాల్లో డబ్బును ఖర్చు చేసింది.
ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు
కొన్నాళ్లుగా ప్రభుత్వం తీసుకున్న అనేక కీలక నిర్ణయాలను వెనక్కి తీసుకోక తప్పడం లేదని నిపుణులు అంటున్నారు. ముందుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లు, వెంటనే శాసన మండలి రద్దు కోసం తీర్మానం, సీఆర్డీయే రద్దు నిర్ణయం ఇలా ఇటీవల ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను వెనక్కు తీసుకోక తప్పలేదు. తాజాగా స్మార్ట్ సిటీ కార్పొరేషన్ల చైర్మన్ల నియామకాల నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుంది. వీటన్నిటికీ ప్రభుత్వం తీసుకుంటున్న హడావిడి నిర్ణయాలే కారణం అని రాజకీయాల్లో ఇది తగదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.