టీడీపీకి షాక్: వైసీపీలో చేరిన టీడీపీ నేత కొమ్మారెడ్డి

by Seetharam |
టీడీపీకి షాక్: వైసీపీలో చేరిన టీడీపీ నేత కొమ్మారెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది.పల్నాడు జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాచర్ల టీడీపీ మాజీ ఇన్‌చార్జి కొమ్మారెడ్డి చలమారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చలమారెడ్డితో పాటు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీ స్ధానిక నాయకులు కే శ్రీనివాసరెడ్డి, కే రామచంద్రారెడ్డి, కే వెంకటేశ్వరరెడ్డి, కే షణ్ముక్‌ రెడ్డి,వీ శంకర్‌‌లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ సీఎం వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed