సీఎం జగన్‌కు బిగ్ షాక్: తెరపైకి ఆ కేసు.. తెలంగాణ హైకోర్టు నోటీసులు

by Seetharam |   ( Updated:2023-11-08 07:06:26.0  )
ys jagan
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు షాక్ తగిలింది. జగన్ అక్రమాస్తు కేసులో తెలంగాణ హైకోర్టు సీఎం జగన్‌కు నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య తెలంగాణ హైకోర్టులో ఇటీవలే పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్ వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిల్ గా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై విచారణ జరిగింది. పిల్‌లో సవరణలను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలతో తెలంగాణ హైకోర్టు ఏకీభవించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు హైకోర్టు ధర్మాసనం అంగీకారం తెలిపింది. అనంతరం మాజీ ఎంపీ హరి రామ జోగయ్య పిల్‌కు నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీకి సీజే ఆదేశించారు. ఈ కేసులో ప్రతివాదులు జగన్, సీబీఐకి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని హరిరామ జోగయ్య కోరారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోపే కేసులు తేల్చేలా ఆదేశాలివ్వాలని మాజీ ఎంపీ హరిరామ జోగయ్య తెలంగాణ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed