చంద్రబాబుకు షాక్: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కేవియట్ పిటిషన్

by Seetharam |   ( Updated:2023-09-28 12:12:49.0  )
చంద్రబాబుకు షాక్: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కేవియట్ పిటిషన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. స్కిల్ స్కాం కేసులో తనను అక్రమంగా రిమాండ్ విధించారని.. తనను నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారని ఈ నేపథ్యంలో రిమాండ్ పిటిషన్‌ను కొట్టివేయాలంటూ చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. అక్టోబర్ 3న చంద్రబాబు నాయుడు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ జరగనున్న నేపథ్యంలో ఉత్తర్వులు ఇచ్చేముందు తమ వాదనలు వినాలని కేవియట్ పిటిషన్‌లో కోరారు. ఏకపక్షంగా వాదనలు వినొద్దని కోరింది. తమ వాదనలు సైతం విన్న తర్వాతే ఉత్తర్వులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరింది.

కోట్ల కుంభకోణం జరిగిందన్న ఏపీ ప్రభుత్వం

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాత్రపై ఎన్నో ఆధారాలున్నాయి అని కేవియట్ పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం తెలిపింది. విద్యార్థులకు శిక్షణ ఇస్తామని కోట్ల కుంభకోణం చేశారు అని ప్రభుత్వం ఆరోపించింది. నిధులను షెల్‌ కంపెనీల ద్వారా రూటు మళ్లించి ఎన్‌క్యాష్‌ చేసుకున్నారు అని తెలిపింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కేసులో మొదట సమాచారం ఇచ్చింది కేంద్ర పరిధిలోని జీఎస్టీ శాఖ అని తెలిపింది. ఈ కేసులో తమ వాదన మీ ముందుంచుతాం అని ఏపీ ప్రభుత్వం కేవియట్ పిటిషన్‌లో తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed