- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
AP:పొన్నవోలుకు ఏఏజీ పదవి ఎందుకిచ్చారు?..షర్మిల సెన్సేషనల్ కామెంట్స్!

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. జగన్ ఆదేశాల మేరకే సీబీఐ ఛార్జిషీట్‌లో YSR పేరును ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేర్చే ప్రయత్నం చేశారని ఏపీసీసీ చీఫ్ షర్మిల పునరుద్ఘాటించారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం జగన్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ బయట పడాలంటే వైఎస్సార్ పేరును ఛార్జిషీట్‌లో చేర్చాలనేది వారి ఉద్దేశమన్నారు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే పొన్నవోలుకు ఏఏజీ పదవి కట్టబెట్టారని ఫైర్ అయ్యారు. సీఎం జగన్‌కి ఆయనతో ఏ సంబంధం లేకపోతే ఆ పదవి ఎందుకిచ్చారని ప్రశ్నించారు. FIR లో వైఎస్ పేరుని సీబీఐ చేర్చలేదన్నారు.
Read More...
జగన్ నటనకు ఆస్కార్ బదులు భాస్కర్ అవార్డు ఇవ్వాలి: నారా లోకేష్
Next Story