BIG BREAKING: పార్లమెంట్ ఎన్నికల బరిలో షర్మిల.. సోదరుడిపై ఎంపీగా పోటీ

by Satheesh |   ( Updated:2024-04-01 08:39:19.0  )
BIG BREAKING: పార్లమెంట్ ఎన్నికల బరిలో షర్మిల.. సోదరుడిపై ఎంపీగా పోటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పోటీపై నెలకొన్న ఉత్కంఠ ఎట్టకేలకు తెరపడింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. కడప సిట్టింగ్ ఎంపీ, ఆమె సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డిని షర్మిల ఢీకొట్టనున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలో ఇవాళ జరిగిన సీఈసీ మీటింగ్‌లో ఏపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులపై చర్చించిన అనంతరం క్యాండిడేట్లను ఫైనల్ చేశారు. మరో 58 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించకుండా కాంగ్రెస్ హోల్డ్‌లో పెట్టింది. మిగిలిన అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. రాజమండ్రి పార్లమెంట్ నుండి ఏపీ కాంగ్రెస్ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు, బాపట్ల నుండి జేడీ శీలం, కాకినాడ బరిలో మాజీ ఎంపీ పల్లంరాజు, విశాఖ పార్లమెంట్ స్థానం నుండి సినీ నిర్మాత సత్యారెడ్డి బరిలోకి దిగనున్నారు. మరి కాసేపట్లో అభ్యర్థుల అధికారిక జాబితా ఏఐసీసీ విడుదల చేయనున్నట్లు సమాచారం.

Read More..

వాలంటీర్లకు మరో షాక్ ఇచ్చిన ఈసీ.. ఆ కార్యక్రమంలో పాల్గొంటే కఠిన చర్యలు

Advertisement

Next Story

Most Viewed