Apలో శైవక్షేత్రానికి వెళ్తున్నారా.. శివరాత్రి ముందు మీకో గుడ్‌న్యూస్

by srinivas |   ( Updated:2023-02-17 10:07:15.0  )
Apలో శైవక్షేత్రానికి వెళ్తున్నారా..  శివరాత్రి ముందు మీకో గుడ్‌న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహా శివరాత్రికి 3800 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా శైవ క్షేత్రాల వద్ద అన్ని సౌకర్యాలతో తాత్కాలిక బస్సు స్టేషన్ల ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఓ ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రంలోని 101 శైవ క్షేత్రాలకు 25 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఘాట్ రోడ్డులలో నైపుణ్యం కల్గిన డ్రైవర్లతో బస్సుల నడుపుతున్నట్లు తెలిపారు. కోటప్పకొండకు 675 బస్సులు, శ్రీశైలంకు 650 బస్సులు, పొలతలకు 200 బస్సులు, పట్టి సీమకు 100 బస్సులు నడుపుతున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రయాణీకుల రద్దీని బట్టి అదనపు ట్రిప్పులు, బస్సులు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు కూడా సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయని ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed