- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబుకు పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం.. సీఐడీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబు అరెస్ట్, తదుపరి పరిణామాలపై ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ స్పందించారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్థిక కుట్రకు పాల్పడినందుకు చంద్రబాబుకు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని, ఈడీ, జీఎస్టీ కూడా ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ కోర్టుకు సమర్పిస్తామని, సాక్షులను ప్రభావితం చేస్తారనే చంద్రబాబును ముందుగా అరెస్ట్ చేసినట్లు క్లారిటీ ఇచ్చారు.
లోకేష్‌ను కూడా ప్రశ్నించాల్సి ఉంటుందని, ఆయన సన్నిహితుడు కిలారు రాజేశ్ పాత్రపై కూడా దర్యాప్తు చేస్తామని సీఐడీ చీఫ్ సంజయ్ స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో రూ.550 కోట్ల స్కామ్ జరిగిందని, నిధులు కాజేసేందుకే కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు గుర్తించామన్నారు. కేబినెట్ ఆమోదం లేకుండానే కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, గంటా సుబ్బారావును ఎండీ, సీఈవోగా నియమించారన్నారు. ఏ డబ్బులు ఖర్చు పెట్టకుండానే షెల్ కంపెనీలకు రూ.371 కోట్లు విడుదల చేశారన్నారు. విచారణలో చంద్రబాబు ప్రధాన లబ్ధిదారుడిగా తేలిందని, ప్రభుత్వ ధనాన్ని షెల్ కంపెనీల ద్వారా చేసిన కేసులో చంద్రబాబు ముఖ్య కుట్రదారుడిగా ఉన్నారని సీఐడీ చీఫ్ సంజయ్ చెప్పారు.
కీలక పత్రాల గల్లంతులో చంద్రబాబు ఇంకొందరు ప్రధాన నిందితులుగా ఉన్నారని సంజయ్ అన్నారు. గల్లంతైన నిధుల విషయంలో విచారణ చేయాల్సి ఉందని, చంద్రబాబును కస్టోడియల్ విచారణకు తీసుకోవడం తప్పనిసరి అన్నారు. రూ.550 కోట్ల అక్రమాలు జరిగిన కేసులో చంద్రబాబు ఇన్వాల్వ్ అయ్యారని ఆయన తెలిపారు. ఏపీలో ఎక్స్ లెన్స్ సెంటర్లు పెట్టేందుకు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అంచనా విలువ రూ.330 కోట్లు అన్నారు. ఈ ప్రాజెక్టులో దాదాపు రూ.300 కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం జరిగిందన్నారు. ఈ కేసుకు చెందిన కీలక పత్రాలు కొన్ని గల్లంతయ్యాయని ఏపీ సీఐడీ అదనపు ఏజీ తెలిపారు.
Read More : త్వరలో నారా లోకేష్ కూడా అరెస్ట్..? సీఐడీ చీఫ్ కీలక వ్యాఖ్యలు