పీసీబీ పత్రాల దహనం కేసులో సంచలనం.. స్క్రాప్ కావడంతో తగలబెట్టామన్న డ్రైవర్

by srinivas |   ( Updated:2024-07-06 06:13:40.0  )
పీసీబీ పత్రాల దహనం కేసులో  సంచలనం.. స్క్రాప్ కావడంతో తగలబెట్టామన్న డ్రైవర్
X

దిశ, వెబ్ డెస్క్: పెనుమలూరులో పీసీబీ పత్రాలు దహనం చేసిన కేసులో పోలీసులు దూకుడు పెంచారు. నిందితులను ఇప్పటికే రెండు రోజుల పాటు విచారించారు. ఈ రోజూ సైతం నిందితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. స్క్రాప్ పత్రాలు కావడంతోనే తగలబెట్టామని డ్రైవర్ చెప్పడంతో వివరాలు ఇవ్వాలని పీసీబీ అధికారులను కోరారు. మరోవైపు కాలిన పత్రాలను పెనమలూరు పోలీసులు పరిశీలిస్తున్నారు.

కాగా జులై 3న రాత్రి 9 గంటలకు పీసీబీ పత్రాలను కారు (ఏపీ 16 ఈఎఫ్ 2596)లో తీసుకొచ్చి కృష్ణా నది కరకట్టపై తగలబెట్టారు. అయితే ఆ కారుపై ప్రభుత్వ వాహనం స్టిక్కర్ ఉండటంతో అటుగా వెళ్తున్న టీడీపీ కార్యకర్తలు గమనించారు. పత్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాలుష్య నియత్రంతణ మండలి మాజీ ఛైర్మన్ సమీర్ శర్మ చిత్రాలు ఉండటంతో వెంటనే పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీసీబీ, మైనింగ్ శాఖకు చెందిన చాలా పత్రాలు, హార్డ్ డిస్క్, క్యాసెట్లు దగ్ధమయినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి కారు డ్రైవర్ నాగరాజు‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో పీసీబీ కార్యాలయం ఓఎస్డీ రామారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీసీబీ మాజీ చైర్మన్ సమీశర్ శర్మ ఆదుశాలతోనే పీసీబీ పత్రాలు తగులబెట్టినట్లు డ్రైవర్ నాగరాజు తెలిపారు. ఈ ఘటనపై సీరియస్ అయిన ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. దహనం చేసిన ఫైల్స్, రిపోర్టులకు సంబంధించిన వివరాలు తక్షణమే అందించాలని ఆదేశించారు.

Advertisement

Next Story