- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vijayawada Floods:వరదలపై మరోసారి స్పందించిన టీడీపీ సీనియర్ నేత..!
దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల(Heavy Rains) కారణంగా విజయవాడను(Vijayawada) వరదలు(Floods) ముంచెత్తాయి. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. భారీ వరదల(Heavy Floods) కారణంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించాయి. ఈ క్రమంలో విజయవాడ వరదలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరోసారి స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వరద బాధితులకు(Flood Victims) అండగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.5లక్షల విరాళం అందజేశానని గుర్తుచేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీడీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా పోరాటాలు చేసిన కార్యకర్తలు సైతం ఈ వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో టీడీపీ కోసం పని చేసిన కార్యకర్తలను ఆదుకునేందుకు తాను మళ్లీ ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఈ వరద నీరు ఇళ్లలోకి చేరడంతో వారి నివాసంలో గృహోపకరణాలు సైతం పాడైపోయాయని తెలిపారు. ఈ క్రమంలో నష్టపోయిన వారందరికీ తమ కుటుంబ సభ్యుల ద్వారా ఆయా వస్తువులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు బుద్ధా వెంకన్నా ప్రకటించారు. ప్రజెంట్ ఆయన వైరల్ ఫీవర్‌తో(Viral Fever) బాధ పడుతున్నానన్నారు. ఆ కారణంగా హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో తాను ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా పార్టీ కోసం పని చేసి వరదల్లో నష్టపోయిన వారు ఉంటే ఆ వివరాలు తన దృష్టికి తీసుకు రావాలని విజ్ఞప్తి చేశారు. వారందరికీ తన వంతుగా తప్పకుండా సహాయం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.