- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Tadipatri: కేతిరెడ్డి పెద్దారెడ్డిని పంచె ఊడదీసి కొడతా: జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో చాలా చోట్ల వైసీపీ, టీడీపీ వర్గీయులు దాడులు చేసుకున్నారు. దీంతో తాడిపత్రి, తిరుపతి, మాచర్ల, సత్తెనపల్లి వంటి ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. తాడిపత్రి, మాచర్లలో అయితే అల్లర్లు సైతం చెలరేగాయి. తాడిపత్రిలో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనతో తాడిపత్రిలో అల్లర్లు జరిగాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అల్లర్లను కంట్రోల్ చేశారు. అయితే ఆ సమయంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యవహరించిన తీరుపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటంతో కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ప్రతీకారం తీర్చుకుంటానని అంటున్నారు.
తాజాగా మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ రోజు జరిగిన సంఘటనపై జేసీ ప్రభాకర్ రెడ్డి తొలిసారి స్పందించారు. తన ట్రావెల్స్‌పై, తనపై పెట్టిన అక్రమ కేసులకు సంబంధించి డీటీసీ, ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. అప్పటి మంత్రి పేర్ని నాని, ఐపీఎస్ సీతారామాంజనేయులు, డీటీసీలపై ఈనెల 24న అనంతపురం వన్ టౌన్‌లో ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే పంచె ఊడదీసి కొడతానని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.