- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Srisailam:సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన షెడ్యూల్
దిశ, న్యూస్ శ్రీశైలం: ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం పర్యటన ఖరారైంది. శనివారం ఉదయం 10.40 గంటలకు ఉండవల్లి లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన ప్రకాశం బ్యారేజ్ చేరుకుంటారు. 10.45 గంటలకు సీప్లేన్ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రకాశం బ్యారేజీ నుంచి సీప్లేన్ లో బయలుదేరి 12.40 గంటలకు శ్రీశైలం పాతాళగంగ వద్ద బోటింగ్ పాయింట్ కు చేరుకుంటారు. 12.45 గంటలకు శ్రీశైలం రోవ్వే వద్దకు, 12.50 గంటలకు రోవ్వే ద్వారా పైకి చేరుకుంటారు. 12.50 గంటలకు ప్రజాప్రతినిధులను కలుసుకుంటారు. 1.05 గంటలకు రోడ్డు మార్గాన భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు.
1.25 గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. 1.30 గంటలకు రోడ్డు మార్గాన రోవ్వే వద్దకు చేరుకుంటారు. 1.30 నుంచి 2 గంటల వరకు విశ్రాంతి తీసుకుం టారు. 2 నుంచి 2.20 గంటల వరకు మీడియా సమావేశంలో పాల్గొంటారు. 2.20 గంటలకు రోప్వే ద్వారా పాతాళగంగకు చేరుకుంటారు. 2.30 గంటలకు శ్రీశైలం పాతాళగంగ నుంచి సీప్లేన్ ద్వారా విజయవాడ కు బయలుదేరుతారు.కాగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం కృష్ణానది వరకు సీప్లేన్ ట్రైల్ రన్ చేయించడం జరిగింది కాగా ముఖ్యమంత్రి శ్రీశైల పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ రాజకుమారి జేసీ సి.విష్ణు చరణ్ ఏ ఎస్ ఎల్ బృందంతో కలిసి పరిశీలించారు.