- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News:ఎస్సీ వర్గీకరణ మాదిగల పోరాటానికి దక్కిన ఫలితం..!
దిశ,నందికొట్కూరు:30 సంవత్సరాల పోరాటానికి ఫలితం దక్కిందని , ఎస్సీ వర్గీకరణను ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడే చేశారని ఎమ్మార్పీఎస్ నాయకులు డాక్టర్ కాటేపోగు రాజు అన్నారు. డా.రాజు ఆధ్వర్యంలో సోమవారం వర్గీకరణను హర్షిస్తూ నందికొట్కూరు పట్టణంలోని స్థానిక పటేల్ సెంటర్ నందు ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వర్గీకరణ సారధి మందకృష్ణ మాదిగ ఫ్లెక్సీల నందు ఏర్పాటుచేసిన చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. కార్యకర్తలకు, నాయకులకు మిఠాయిలు పంచి పెట్టారు. మంద కృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే తెదేపా మద్దతు ఇచ్చిందన్నారు. నాటి చంద్రబాబు ప్రభుత్వం 1996నే రామచంద్ర రాజు కమిషన్‌ను ఏర్పాటు చేసిందని ఎమ్మార్పీఎస్ నాయకులు డాక్టర్ రాజు అన్నారు.
1997 లో మేలో నివేదిక ఇచ్చిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అదే ఏడాది జూన్ 6 ఎబిసిడి వర్గీకరణగా విభజిస్తూ జీవో విడుదల చేసింది. ఈ సందర్భంగా లింగాల స్వాములు మాట్లాడుతూ కూటమి నాయకులకు, ప్రధాని నరేంద్ర మోడీకి, చంద్రబాబు నాయుడుకి, మందకృష్ణ మాదిగ, రుణపడి ఉంటామని అన్నారు. ఇంతటి చారిత్రాత్మక తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ మిట్టకందాల స్వాములు, నందికొట్కూరు జనసేన సమన్వయ కమిటీ సభ్యులు మద్దిలేటి, ఉమ్మడి జిల్లా జై మాదిగ సేవా సమితి సోషల్ మీడియా అధ్యక్షులు సంపత్, మాదిగ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఈశ్వరయ్య, గాంధీ, ప్రతాప్, కుమార్ రాజా, మాజీ కౌన్సిలర్ రవణమ్మ, కాటేపోగు నాగ సురేష్, జనసేన నాయకులు కుమార్, చిన్న, పుష్ప రాజు, బాలరాజు, బ్రహ్మయ్య, నాగరాజు, తిక్క రాజు, స్వాములు తదితరులు పాల్గొన్నారు.