- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేవర సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలు
దిశ, వెబ్ డెస్క్ : జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా రేపు విడుదలవుతున్న వేళ సినిమా ప్రచార పోస్టర్ల వ్యవహారంలో కీలక పరిణామాం చోటుచేసుకుంది. విశాఖపట్నం రామా టాకీస్ థియేటర్ వద్ద సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్.. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనే నినాదాల పోస్టర్లను జన జాగరణ సమితి నాయకులు దేవర సినిమాపై పోస్టర్లపై అతికించారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతునివ్వాలని కోరుతూ జన జాగరణ సమితి ఈ రకమైన ప్రచారం చేపట్టింది.
కోట్లాదిమంది అభిమానులు ఉన్న జూనియర్ ఎన్టీఆర్ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపడం వల్ల ప్రభుత్వాల్లో తప్పనిసరిగా చలనం వస్తుందని జన జాగరణ సమితి నాయకులు చెబుతున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని మరింతగా జనంలోకి తీసుకెళ్ళేందుకు దేవర సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆ సినిమా పోస్టర్ల పై సేవ్ విశాఖ ప్రచార పోస్టర్లు అతికించినట్లుగా వెల్లడించారు.