మత్స్యకారులకు సర్కార్ శుభవార్త

by Anjali |   ( Updated:2023-05-14 04:22:20.0  )
మత్స్యకారులకు సర్కార్ శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మత్స్యకారులకు తీపికబురు అందించింది. ఈ నెల(మే) 16వ తేదీన సీఎం జగన్ బాపట్ల జిల్లా నిజాంపట్నంలో పర్యటించనున్నారు. కాగా, బహిరంగ సభ ముగిశాక వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద ఒక్కొక్కరి అకౌంట్లలో రూ.10వేలు జమచేయనున్నారు. సముద్రంలో 60 రోజులపాటు వేట నిషేదం సమయంలో గంగపుత్రులకు అండగా నిలిచేందుకు ఈ పథకాన్ని సర్కారు అమలు చేయనుంది. దీంతో సుమారు 1.23 లక్షల మంది మత్స్యకారులకు 123 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరనుంది.

Advertisement

Next Story