- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో జోరుగా కోడి పందేలు.. లక్షల్లో బెట్టింగులు
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, ఇటు అనంతపురం నుంచి కర్నూలు వరకు పట్టణాలు, పల్లెల్లో సంక్రాంతి శోభ కనిపిస్తోంది. కొత్త అల్లుళ్లు, బంధువులతో ఇళ్లు కళకళలాడుతున్నాయి. మరోవైపు కోడి పందేలు కూడా జోరుగా జరుగుతున్నాయి. వీటితో పాటు గుండాట, పేకాట ఆడుతూ మస్తుగా ఆడుతున్నారు. అంతేకాదు ఈ ఆటల్లో లక్షల్లో బెట్టింగులు కాస్తున్నారు.
ఇక కోడి పందేలకు అయితే స్పెషల్ ఏర్పాట్లు చేశారు. సిట్టింగ్ విధానంతో పాటు బెట్టింగుల కట్టుకునేందుకు స్పాలోనే క్యాష్ అందేలా ఏర్పాట్లు చేశారు. వీటితో పాటు మందు, విందు, చిందు కార్యక్రమాలు కూడా సాగుతున్నాయి. కాయ్ రాజా కాయ్ అంటూ రాష్ట్రవ్యాప్తం పందెంరాయుళ్లు కోడి పందేలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సంక్రాంతి సందర్భంగా ఏళ్ల తరబడి ఈ మూడు రోజుల పాటు సంప్రాదాయంగా కోడి పందేలు నిర్వహిస్తారు. ఈ పందేళ్లో లక్షలు చేతులు మారతాయి. పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందేలు ఆడేందుకు తెలంగాణ నుంచి కూడా వెళ్తారు. ఈ జిల్లాలోని ఆకివీడు, నిడమర్రు, జంగారెడ్డి, ఉండి, భీమవరం, నరసాపురం తదితర ప్రాంతాల్లో జోరుగా కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి శిబిరాలు ఏర్పాటు చేసి మరీ పందెంరాయుళ్లు బరుల్లోకి దిగారు. లక్షల్లో పందేలు కాస్తున్నారు. ఉండి మండలం మహదేవపట్నంలో అయితే ఏకంగా ఒక గ్రౌండ్‌లోనే కోడి పందేల ఏర్పాట్లు చేశారు. అంతేకాదు పందేల్లో పాల్గొనే పందెం రాయుళ్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. అటు పందేలను చూసే వారికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీ టెంట్లు వేసి వాటికి ఫ్లడ్ లైట్స్, ఎల్‌ఈడీ స్కీన్లు కూడా అమర్చారు. మరోవైపు చిత్తూరు జిల్లాలో జల్లికట్టు నిర్వహించారు. ఎద్దులను లొంగదీసుకునేందుకు యువత పాల్గొని గాయాలపాలయ్యారు. ఇలా పల్లెల్లో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటుతున్నాయి.