Transgender: ట్రాన్స్ జెండర్ కి ఆ పార్టీ టికెట్..

by Indraja |
Transgender: ట్రాన్స్ జెండర్ కి ఆ పార్టీ టికెట్..
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: సమాజ్ వాదీ పార్టీ ట్రాన్స్ జెండర్ నాయకులు సూరాడ యల్లాజీని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎం.ఎల్.ఎ అభ్యర్థి గా ఎన్నికల బరిలో దించుతోంది. తాజగా మీడియాతో మాట్లాడిన సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జాలాది విజయ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో రానున్న 2024 లోకసభ అలానే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి పార్టీ దిగుతందని తెలిపారు.

ఇక ఒక చారిత్రాత్మక అంశానికి శ్రీకారం చుట్టబోతుందని పేర్కొన్నారు. అర్ధనారీశ్వర స్వరూపులైన ట్రాన్సో జెండర్స్ అన్నీ రంగాల్లో తమ యొక్క సత్తా చాటుతున్న తరుణంలో వాళ్ళ వాణి అసెంబ్లీ లో కూడా వినిపించాలి అన్న సదుద్దేశంతోనే టాన్స్ జెండర్ నాయకులు సురాడ యల్లాజీ కి విశాఖ దక్షిణ నియోజకవర్గం నుండి ఎం.ఎల్.ఎ గా పోటీ చేసే అవకాశాన్ని కల్పించడం జరిగిందని తెలిపారు.

Advertisement

Next Story