- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన సజ్జల..
దిశ వెబ్ డిస్క్: ఇటీవల వై.ఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ లో చేరిన సంగతి అందరికి సుపరిచితమే. అయితే షర్మిల కాంగ్రెస్ లో చేరడం పైన సపందించిన ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరినంతమాత్రాన వైసీపీ కి వాటిల్లే నష్టం ఏం లేదని ఆయన తెలియ చేశారు. అయితే షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హస్తం ఉందని ఆరోపించారు.
షర్మిల కాంగ్రెస్ లో చేరేలా చంద్రబాబు కుట్ర చేశారని పేర్కొన ఆయన షర్మిల ఎక్కడి నుండైనా రాజకీయంగా పోటీ చెయ్యొచ్చు అని వెల్లడించారు. అయితే కాంగ్రెస్ పార్టీ కి ఆంధ్రప్రదేశ్ లో భవితవ్యం లేదని.. అలాంటి పార్టీ ఎంతగా మేకపోతు గాంభీర్యాలను ప్రదర్శించిన పట్టించుకోమని వెల్లడించారు. ఇక షర్మిల కాంగ్రెస్ లో ఉన్నంత మాత్రాన వైసీపీకి వచ్చిన నష్టమేం లేదని సజ్జల పేర్కొన్నారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నిన, ఎన్ని వ్యూహాలు రచించిన చివరికి గెలిచే పార్టీ వైసీపీ పార్టీ అని వెల్లడించారు. పొత్తులతో తమకు పనిలేదని.. అహర్నిశలు ప్రజల మంచికోసం పాటుబడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్న పార్టీ వైసీపీ అని తెలిపారు.