- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Roja: వారు కల్తీ ప్రచారాన్ని నమ్ముకున్నట్లున్నారు.. మాజీ మంత్రి సంచలన ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: కల్తీ రాజకీయాలు చేస్తారు కాబట్టి కల్తీ ప్రచారాన్ని నమ్ముకున్నట్లున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా అన్నారు. "ఈ లడ్డూ మంచిదే, కల్తీది కాదు" అంటూ.. ప్రధానమంత్రితో చమత్కరించిన సీఎం అని ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రోజా.. "చింత సచ్చిన పులుపు చావలేదు ఆన్న సామెత మన ముఖ్యమంత్రి చంద్రబాబు కోసమే పుట్టినట్లు ఉన్నది" అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలపై విచారణ, ఆధారాలు లేకుండా రాజకీయ దురుద్దేశంతో కల్తీ ఆరోపణలు చేసి కోట్ల మంది హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారని అన్నారు.
సుప్రీం కోర్టు బాబు సిట్‌ను కాకుండ సీబీఐ సారథ్యంలో నూతన సిట్ ఏర్పాటు చేయడంతో పాటు రాజకీయ విమర్శలు వద్దంటూ ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. అయినా తన కలుషిత బుద్ధి మానుకొని ముఖ్యమంత్రి ప్రధాని మోడీకి శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అందజేసిన సందర్భాన్ని కూడా తన మీడియాతో స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన లడ్డు అని ముఖ్యమంత్రి అంటే ప్రధాని సంతోషించారంటూ కల్తీ వార్తలు ప్రచారంలో పెట్టారని తెలిపారు. ఇక తాను మాట్లాడితే కోర్టు ధిక్కరణ అవుతుందని, తన మీడియాతో కల్తీ కథనాలు ప్రచారంలో పెట్టారని, కల్తీ రాజకీయాలు చేసే వారు గనుక కల్తీ ప్రచారాన్ని నమ్ముకున్నట్లున్నారని రోజా విమర్శించారు.