ఘోర రోడ్డు ప్రమాదం.. నవ దంపతులు సహా ముగ్గురు మృతి

by Mahesh |
ఘోర రోడ్డు ప్రమాదం.. నవ దంపతులు సహా ముగ్గురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మృతులు గదరగుట్టపల్లికి చెందిన భార్యభర్తలుగా పోలీసులు గుర్తించారు. వారు రెండు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. రెండు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న యువ జంట రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో.. ఇరు కుటుంభాల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed