- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఘోర ప్రమాదం.. దైవదర్శనంకు వెళ్లొస్తూ తిరిగిరాని లోకాలకు
దిశ, డైనమిక్ బ్యూరో : ఉద్యోగంలో బిజీబిజీగా ఉండే ఆ కుటుంబం తమ స్వగ్రామంలో జరిగే గంగదేవత జాతరలో పాల్గొనేందుకు వెళ్లారు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులతో కలిసి ఆ జాతరలో సందడి చేశారు. అందరితో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. అనంతరం గురువారం విధులకు హాజరుకావల్సి ఉండటంతో దంపతులు తమ బంధువులతో కలిసి బయలుదేరారు. మార్గమధ్యలో కారు అదుపుతప్పి లోయలోపడింది. దీంతో ఆ దంపతులు మృతి చెందారు. అలాగే డ్రైవర్ కూడా మృతి చెందాడు. మరో వ్యక్తి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషాద ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం కిలాగాడ గ్రామానికి చెందిన చెండా సుబ్బారావు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్(ఎల్ఐసి) లో అడిషనల్ డివిజనల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. భార్య మహేశ్వరి టీచర్‌గా విధులు నిర్వహిస్తుంది.
ఉద్యోగ నిమిత్తం ఈ దంపతులకు పిల్లలతో కలిసి విశాఖపట్నంలో నివాసం ఉంటున్నారు. అయితే తమ స్వగ్రామంలో గంగదేవత జాతర వుండటంతో దంపతులిద్దరు సమీప బంధువు పూర్ణచంద్రారావుతో కలిసి స్వగ్రామానికి వెళ్లారు. కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులతో కలిసి గంగదేవత జాతరను ఎంతో సందడిగా జరుపుకున్నారు. మంగళవారం జాతర ముగియడంతో బుధవారం రాత్రి విశాఖపట్నంకు తిరుగుపయనమయ్యారు. అయితే పాడేరు ఘాట్ రోడ్డులో వీరు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పింది. వంట్లమామిడి సమీపంలోని కోమలమ్మ పనుకు దగ్గర మలుపులో కారు అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొట్టి లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ఉమామహేశ్వరరావు, చెండా మహేశ్వరి అక్కడిక్కడే దుర్మరణం చెందారు. సుబ్బారావు, సమీప బంధువు పూర్ణ చంద్రరావు తీవ్ర గాయాల పాలవ్వడంతో పోలీసులు వారిని పాడేరు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్సపొందుతూ సుబ్బారావు మృతి చెందారు. పూర్ణచంద్రారావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. స్వగ్రామంలో కుటుంబ సభ్యులు, బంధువులతో ఎంతో సంతోషంగా గడిపిన సుబ్బారావు-మహేశ్వరి దంపతులు కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో అటు కుటుంబంలోనూ ఇటు గ్రామంలోనూ విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు డ్రైవర్ ఉమా మహేశ్వరరావు స్వగ్రామం కంచరపాలెంలోనూ తీవ్ర విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.