సినిమా స్టంట్‌ను తలపించిన యాక్సిడెంట్: గాలిలో వేలాడిన లారీ

by Seetharam |   ( Updated:2023-11-09 09:23:46.0  )
సినిమా స్టంట్‌ను తలపించిన యాక్సిడెంట్: గాలిలో వేలాడిన లారీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కోల్‌కతా నుంచి విశాఖ వైపు వెళ్తున్న ఓ కంటైనర్ జమ్ము జంక్షన్ దగ్గర ఫ్లై ఓవర్ పై అదుపుతప్పింది. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. దీంతో లారీ ముందు భాగం ఫ్లై ఓవర్ పై నుంచి కిందకు వేలాడుతూ మధ్యలో నిలిచిపోయింది. కంటైనర్ ఫ్లై ఓవర్ నుంచి కిందకు జారి పడకపోయింది.లారీ రక్షణ గోడ దాటుకుని కింద పడితే మాత్రం పెను ప్రమాదమే జరిగేదని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇకపోతే రద్దీగా ఉండే హైవేపై ఇలాంటి ప్రమాదం జరగడంతో ప్రయాణికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ ప్రమాదంలో కంటైనర్ ముందు భాగం ధ్వంసమైంది. అయితే ప్రమాదం జరిగే సమయంలో ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అంతా ఊపరిపీల్చుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed