- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
RK Roja: సూపర్ చీట్స్‌గా సూపర్ సిక్స్.. మాజీమంత్రి ఆర్కే రోజా హాట్ కామెంట్స్
దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు(CM Chandrababu) మహిళల(Womans)ను మరోసారి మోసం(Cheating) చేశారని, ఎన్నికల్లో చెప్పిన సూపర్ సిక్స్(Super Six).. సూపర్ చీట్స్(Super Cheats).. గా మారిపోయిందని మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా(YCP Leader) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం(NDA Govt) ప్రవేశ పెట్టిన బడ్జెట్(Budget) పై స్పందించిన ఆమె.. ఎక్స్ లో ప్రత్యేక పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా.. తొలి బడ్జెట్ లోనే చంద్రబాబు నాయుడు మోసం బయటపడిందని విమర్శించారు. 19 ఏళ్ల నుండి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1500 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తాం అని.. బడ్జెట్లో నిధులు ఇవ్వకపోవడం మోసం కాదా? అని, ఎన్నికల్లో గెలవగానే ప్రతి నిరుద్యోగ యువతి, యువకులకు నెలకి 3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తాం అని ఒక్క రూపాయి కేటాయించకపోవడం దగా కాదా? అని మండిపడ్డారు.
అలాగే ఎన్నికల్లో గెలవగానే మహిళలకి ఉచిత బస్ పథకం అమలు చేస్తామని చెప్పి, ఆ పథకానికి నిధులే ఇవ్వకపోవడం మోసం కాదా? అని, తల్లికి వందనం పథకానికి నిధులు సగానికిపైగా కోత పెట్టడం దగా కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి, 2 సిలిండర్లను ఎగనామం పెట్టారని, 50 ఏళ్లకే మహిళలకు పెన్షన్ ఇస్తామని, బడ్జెట్ లో ఆ ప్రస్తావన ఏదని దుయ్యబట్టారు. ఇక రైతులకు 20 వేలు ఏడాది పెట్టుబడి సహాయం ఇస్తామన్నారని, దానికి 10 వేల కోట్లు ఇవ్వాల్సింది 4,500 కోట్లే ఇవ్వడం రైతులను మోసం చేయడం కాదా అని నిలదీశారు. ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఇంటింటికి మీరిచ్చిన బాబు ష్యురిటీ(Babu Surety).. భవిష్యత్ కి గ్యారంటీ.. బాండ్లను ఇప్పుడు ఏం చేసుకోవాలని ఎద్దేవా చేశారు. అంతేగాక ఆ చెల్లని బాండ్లపై ఇప్పుడు ప్రజలు చీటింగ్ కేసులు పెట్టాలా? సమాధానం చెప్పాలని రోజా డిమాండ్ చేశారు.