- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ కళ్యాణ్ అందుకే దానికి ఒప్పుకున్నారు..ఓర్నీ ఎంతమాట అనేశాడు ఆర్జీవీ
దిశ డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ పొత్తులు ప్రకటించిన తరువాత మొదటిసారిగా సీట్ల కేటాయింపు పై అధికారికంగా ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఇక ప్రస్తుతం జనసేనకు 24 సీట్లను తెలుగుదేశం పార్టీ జనసేనకు కేటాయిస్తూ అధికారికంగా ప్రకటించింది. అయితే జనసేనకు 24 సీట్లు మాత్రమే రావడంతో ఓ వైపు జనసేన పార్టీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. మరో వైపు వైసీపీ నేతలు, కార్యకర్తలు పవన్ కళ్యాన్ న్ని ఎద్దేవ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ వైసీపీ సపోర్టర్ ఆర్జీవీ జనసేనకు 24 సీట్లు రావడంపై పవన్ కళ్యాన్ న్ని ఎద్దేవ చేస్తూ ట్విట్టర్ వేధికగా ఓ ఫోటోని షేర్ చేశారు. కాగా.. 24 గంటలూ జనానికి అందుబాటులో ఉంటామని చెప్పటానికే.. 24 సీట్లు తీసుకున్నాం అని ఆ ఫోటోపై రాసి ఉంది. ఇక నిన్న కూడ ఇదే అంశంపై ట్వట్టర్ లో ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో జనసేనకు 23 సీట్లు ఇస్తే టీడీపీ లక్కీ నెంబర్ అని ట్రోల్ చేస్తారని.. 25 సీట్లు ఇస్తే పావలాకి పావలా సీట్లు ఇచ్చారని ట్రోల్ చేస్తారని.. అందకే మధ్యమార్గంగా 24 సీట్లు అని రాసుకొచ్చారు.