- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Health University: హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్దరణ.. ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్దరించింది. ఈ మేరకు శనివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇక నుంచి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరుతో కార్యకలాపాలు కొనసాగనున్నాయి. గతంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ హెల్త్ యూనియర్సిటీగా మార్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హెల్త్ యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ పేరు పెట్టాలని నిర్ణయించారు. దీనిపై జూన్ 24న ఏపీ అసెంబ్లీలో వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రవేశ పెట్టిన తీర్మాణం ప్రవేశపెట్టగా.. ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. దీంతో ఇవ్వాళ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా మార్చుతూ 2022లో గత జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆనాడు సర్కారు తీర్మానం చేయగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదం తెలపడంతో వైసీపీ ప్రభుత్వం ఆ బిల్లును చట్టంగా మార్చింది. గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీనిపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తాయి.