- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల భేటీ.. అమరావతిపై కీలక చర్చలు
దిశ ఏపీ బ్యూరో, అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు భేటీ అయ్యారు. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి నిర్మాణంలో ఎలా ముందుకెళ్తుందనే దానిపై వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులకు సీఎం వివరించారు. ప్రపంచంలోని ఉత్తమ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని అమరావతి నిర్మాణం చేపడుతున్నట్లు సీఎం చంద్రబాబు వివరించారు. కాగా నలుగురు సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం గత రెండు రోజులుగా అమరావతిలో పర్యటించింది. ఈ బృందంలో వరల్డ్ బ్యాంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీనియర్ స్పెషలిస్ట్ రఘు కేశవన్, లీడ్ ట్రాన్స్పోర్ట్ స్పెషలిస్ట్ గెరాల్డ్ పాల్ అలీవియర్, సీనియర్ అర్బన్ స్పెషలిస్ట్ కింగ్ యున్ షెన్, సౌత్ ఏషియా అర్బన్ ప్రాక్టీస్ మేనేజర్ అబేదాలిరజాక్ ఎఫ్.ఖలీల్ ఉన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా విజయవాడ వచ్చిన ప్రపంచ బ్యాంక్ బృందం సోమవారం మధ్యాహ్నం సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. సీఆర్డీయే గురించి అమరావతి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులు బృందానికి వివరించారు. శనివారం మధ్యాహ్నం అమరావతిలో క్షేత్ర స్థాయిలో పర్యటించి నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించారు. రెండో రోజు ఆదివారం రాజధానిలోని రోడ్లను, కొండవీటి వాగు ఎత్తిపోతల పంప్ హౌస్ ను పనులను పరిశీలించడంతో పాటు విట్, ఎస్ఆర్ఎం, ఎయిమ్స్‌లను పరిశీలించారు.