రాజకీయాల గురించి రేణు దేశాయ్ సంచలన పోస్ట్.. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదంటూనే.. ఆ పార్టీ తరపున ప్రచారం..

by Disha Web Desk 7 |
రాజకీయాల గురించి రేణు దేశాయ్ సంచలన పోస్ట్.. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదంటూనే.. ఆ పార్టీ తరపున ప్రచారం..
X

దిశ, సినిమా : పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్, నటి రేణు దేశాయ్ ఏ విషయాన్ని అయినా ఓపెన్ గా మాట్లాడేందుకు ముందుంటుంది. తన విడాకుల నుంచి పిల్లల పెంపకం వరకు ఆమె జీవితం తెరిచిన పుస్తకమే కాగా తన జోలికి వచ్చిన నెటిజన్లకు ఇచ్చిపడేస్తుంది. తన రెండో పెళ్లి అని ప్రచారం జరిగినప్పుడు కూడా లెఫ్ట్ రైట్ ఇచ్చి లైట్ తీసుకుంది. ఇక రీసెంట్ గా మళ్లీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చిన ఆమె.. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా రాజకీయాల గురించి పోస్ట్ పెట్టింది రేణు దేశాయ్. హైదారాబాద్ బీజేపీ ఎంపీ క్యాండిడేట్ మాధవీలత స్ట్రాంగ్ ఉమన్ అని పేర్కొంటూ ప్రశంసించింది. చాలా రోజుల తర్వాత ఇలాంటి మహిళను చూశానని చెప్పింది. అయితే ఈ పోస్ట్ కోసం తాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని, తనకు అనిపించిందే షేర్ చేశానని తెలిపింది. ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎంఎల్ఏ అభ్యర్ధిగా నామినేషన్ వేశాడు. పకడ్బందీగా ప్రచారం చేస్తున్నాడు. ఈ టైంలో రేణు దేశాయ్ ఇలాంటి పోస్ట్ పెట్టడమే ఆసక్తిగా మారింది.

Read More..

AP Politics:వాళ్లిద్దరికీ ఓటేస్తే..ఓటు డ్రైనేజీలో వేసినట్లే: వైఎస్ షర్మిల



Next Story

Most Viewed