చంద్రబాబుకు ఊరట: నవంబర్ 9 వరకు అరెస్ట్ చేయోద్దన్న సుప్రీంకోర్టు

by Seetharam |   ( Updated:2023-10-20 05:58:51.0  )
చంద్రబాబుకు ఊరట: నవంబర్ 9 వరకు అరెస్ట్ చేయోద్దన్న సుప్రీంకోర్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. ఈ కేసులో నవంబర్ వరకు చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయోద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు దిగువ కోర్టులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. తదుపరి విచారణను నవంబర్ 9కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఇకపోతే ఏపీ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు నేడు వాదనలు వినిపించింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. జస్టిస్ అనిరుద్ధ బోస్ .. జస్టిస్ ఎం బేలా త్రివేది ధర్మాసనం విచారణ జరిపింది. చంద్రబాబు నాయుడు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెల్లడించాల్సి ఉందని సిద్ధార్థ లూథ్రా వాదించారు. ఇరు వాదనలు విన్న సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసినట్లు తెలిపింది. ఈ కేసులో తొలుత తీర్పు వెల్లడిస్తామని స్పష్టం చేసింది. అనంతరం ఏపీ ఫైబర్ నెట్ కేసుపై వాదనలు వింటామని తెలిపింది. అప్పటివరకు ఏపీ ఫైబర్ నెట్ కేసులో యథాస్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. పిటీ వారెంట్లపై యధాస్థితిని కొనసాగించాలని స్పష్టం చేసింది. అప్పటి వరకు చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయోద్దని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

Read More..

దేశవ్యాప్తంగా ఉత్కంఠ: చంద్రబాబుకు సుప్రీంకోర్టులోనైనా రిలీఫ్ దొరికేనా?

Advertisement

Next Story

Most Viewed