ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ఊరట.. సీఐడీకి షాక్

by Ramesh Goud |   ( Updated:2024-02-09 14:16:51.0  )
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ఊరట.. సీఐడీకి షాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ సీఐడీ చార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ఏ1 ముద్దాయిగా ఉన్నారు. అయితే ఇందులో సీఐడీ పోలీసులకు షాక్ తగిలింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ అధికారులు చంద్రబాబుపై పెట్టిన చార్జిషీట్ ను గురువారం ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం చార్జ్ షీట్ ను తిరస్కరించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం చార్జ్ షీట్ వేయాడానికి అనుమతి లేదని, అనుమతి లేకుండా ఎలా ఓపెన్ చేస్తారని సీఐడీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చార్జిషీట్ వేయాలంటే సెక్షన్ 19 ప్రకారం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొంది. ఈ కేసులో సీఐడీ పోలీసులు చంద్రబాబు నాయుడుతో పాటు మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేష్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాజశేఖర్ సహ పటువురి పేర్లు చార్జిషీట్ లో చేర్చారు.

Also Read..

చంద్రబాబు ఆస్తులపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed