- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సారథితో రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి భేటీ..
దిశ వెబ్ డెస్క్: నిన్న సీఎం జగన్తో ఎమ్మెల్యే పార్థసారథి సమావేశమైన విషయం అందరికి సుపరిచితమే. అయితే ఇప్పటికి ఎమ్మెల్యే పార్థసారథి విషయం తేలలేదు. తాజాగా ఈ రోజు సారథితో రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇరువురు 30 నిమిషాలు పాటు చర్చించుకున్నారు. అయితే ఇప్పటికి సారథి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. సారథితో చర్చించిన అనంతరం అయోధ్య రామిరెడ్డి సీఎం జగన్ ని కలిసి సమావేశ సారాంశాన్ని తెలియచేసారు. అయితే మరోవైపు సారథి టీడీపీలో చేరతారనే ప్రచారం జోరుగా జరగుతోంది. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న తాజా పరిణామాలతో సారథి పార్టీ మార్పు ఖాయమనే సంకేతాలు కనపడుతున్నాయి.
అయితే సారథి విషయం పై పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ స్పందించారు. నిన్న సారథితో కలిసి తాను సీఎం జగన్ ను కలిశామని.. జిల్లాలో, పార్టీలో జరుగుతున్న విషయాలపై చర్చించామని పేర్కొన్నారు. కాగా సీఎం జగన్ తమ కుటుంబ పెద్దని.. మా పార్టీ విషయాలు మా అంతర్గతం అని.. అందులో జోక్యం చేసుకోవడం టీడీపీకి సభ్యత కాదని ఆరోపించారు. సీఎం దగ్గరకు వెళ్తే టికెట్లు మారుస్తారని అనటం సబబు కాదని.. ఇదంతా టీడీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం అని దుయ్యబట్టారు. ఇక టికెట్ ఇవ్వని మాట నిజమైతే అది ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది అని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో తాను పామర్రు నుంచి పోటీ చేయటం ఖాయమని ఎమ్మెల్యే కైలే అనిల్ ధీమా వ్యక్తం చేశారు. అయితే పార్థసారధి వైసీపీ నుంచి పోటీ చేస్తారా లేదా అనే అంశంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.