Srisailam Reservoir:శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం

by Jakkula Mamatha |   ( Updated:2024-07-31 11:50:34.0  )
Srisailam Reservoir:శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం
X

దిశ,వెబ్‌డెస్క్: గత వారం నుంచి శ్రీశైలం జలశాయానికి భారీగా వరద నీరు వస్తుండటంతో మంగళవారం రెండు గెట్లు ఎత్తి, రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే నేడు(బుధవారం) శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. జూరాల, సుంకేసుల నుంచి 2,91,003 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరుతుంది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 212 TMCల నీటి నిల్వ ఉండగా..నీటి మట్టం 884.50 అడుగులుగా ఉంది. 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,22,768 క్యూసెక్కులు, శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ 60,232 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి వరద ప్రవాహం వస్తుండటంతో నాగార్జున సాగర్ జలకళను తలపిస్తుంది. ఎనిమిది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. దీంతో నాగార్జునసాగర్ డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

Advertisement

Next Story

Most Viewed