- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Rammohan Naidu: కూటమి ప్రభుత్వంలో ఆంక్షలు ఉండవు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: సీఎం (CM) జిల్లాల పర్యటన ఉందంటే వైసీపీ ప్రభుత్వం (YCP Government)లో ఉన్నట్లుగా.. తమ ప్రభుత్వంలో ఎలాంటి ఆంక్షలు ఉండవని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు (CM Chandrababu) శ్రీకాకుళం పర్యటన (Srikakulam Tour) హంగు, ఆర్భాటాలు లేకుండా ప్రశాంతంగా కొనసాగిందని పేర్కొన్నారు. ఐదేళ్ల వైసీపీ (YCP) పాలనలో ప్రజలకు అష్టకష్టాలు పడ్డారని ఆరోపించారు.
ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి చంద్రబాబు (Chandrababu) అని.. అందుకే ఆయన ప్రజల ముఖ్యమంత్రి అయ్యారని కితాబిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో సీఎం (CM) జిల్లాల్లో పర్యటిస్తున్నారంటే పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టేవారని గుర్తు చేశారు. అధికారులు సీఎం (CM) పర్యటించే ప్రాంతాల్లో చుట్టూ పరదాలు కట్టే వారని ఎద్దేవా చేశారు. అలాంటి సంస్కృతికి కూటమి ప్రభుత్వం (Coalition Government) చరమగీతం పాడిందని పేర్కొన్నారు. ఓ సీఎం జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించడం చరిత్రలో ఇదే తొలిసారి అని ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాల్లో ఉన్న సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని.. త్వరలోనే సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.